హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): బేగంపేట టూరిజం ప్లాజాలోని మినర్వా హోటల్‌లో గురువారం రానా అనే కస్టమర్ సాంబార్ రైస్ ఆర్డర్ ఇవ్వగా అందులో బొద్దింక ప్రత్యక్ష అయ్యింది. సదరు కస్టమర్ విషయాన్ని హోటల్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులు హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. హోటల్‌లోని పలు ఆహారాల శాంపిల్ సేకరించి నాణ్యతా ప్రమాణాల నిర్ధ్దారణ కోసం ల్యాబ్‌కు పంపిచారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా హోటల్‌పై చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.