calender_icon.png 23 January, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మటన్ ఖీమాలో బొద్దింక

26-08-2024 03:23:04 AM

హోటల్ యాజమాన్యానికి రూ.5 వేల జరిమానా

నిజామాబాద్, ఆగస్ట్ 25 (విజయక్రాంతి): ఆకలి తీర్చుకుందామని నిజామాబాద్‌లోని ఓ హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. తనకు నచ్చిన పదార్థం ఆర్డర్ చేయగా దానిలో  బొద్దింక కనిపించింది. వినియోగదారుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు హోటల్ యాజమాన్యానికి జరిమానా విధించారు. నగరవాసి ఒకరు ఆదివారం ఎన్టీఆర్ చౌరస్తాలోని మోక్ష్ హోటల్‌కు వెళ్లాడు. మటన్ ఖీమా ఆర్డర్ చేశాడు. ఖీమాలో బొద్దింక కనిపించింది. వెంటనే వినియోగదారుడు మున్సిపల్ కమిషనర్ మకరంద్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి హోటల్ యాజమాన్యానికి రూ.5 వేలు జరిమానా విధించారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించాలన్నారు.