కొత్తపేటలోని జాగవీస్ కృతుంగ రెస్టారెంట్‌లో..
ఎల్బీనగర్, డిసెంబర్ 4: కొత్తపేటలోని జాగవీస్ కృతుంగ రెస్టారెంట్‌లో బిర్యానీలో బొద్దింక వచ్చింది. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీకి చెందిన సందీప్ తన నలుగురు స్నేహితులతో కలిసి మధ్యాహ్నం రెస్టారెంట్‌కు భోజనానికి వచ్చాడు. మొదటగా కీమా బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు.
అనంతరం చికెన్ రోస్ట్ బిర్యానీ తింటున్న క్రమంలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఆందోళనకు గురైన సందీప్.. ఇదేమిటని రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించాడు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీ చేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.