- అశ్వారావుపేట, దమ్మపేట ఏరియాలో జోరు..
- ప్రతిరోజు రూ.లక్షల్లో చేతులు మారుతున్న డబ్బు
ఖమ్మం, జనవరి 1 ( విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో కోడిపందాల జోరు ఊపందుకున్నది. పోలీసులు, రెవె అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో నిత్యం లక్షలాది రూపా చేతులు మారుతున్నాయి. సంక్రాంతి వస్తుందంటే చాలు పండుగకు ముందే జిల్లా సరిహద్దుల్లో కోడి పందాలు నడుస్తుంటాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ జూదం నడుస్తుంది. ఖమ్మం జిల్లాలో ఏపీ సరిహద్దుల్లోని అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, గంగారం, సత్తుపల్లి,పెనుబల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పండాలు నడుస్తున్నాయి. కారుల్లో వచ్చి మారీ బహిరంగంగానే ఆడుతున్నా ఎవరికీ పట్టడం లేదు.
జిల్లా సరిహద్దుల్లోని జంగారెడ్డిగూడెం, తిరువూరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జూద వచ్చి పందాలు కాస్తున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు పందాల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ సరిహద్దుల్లోని జగ్గయ్యపేట ప్రాంతంలోనూ కోడిపందాలు నడుస్తున్నట్లు సమాచారం.
జిల్లా సరిహద్దుల్లోని తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జూదగాళ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి, జాదం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రాత్రిళ్లూ ఫ్లడ్ లైట్ల వెలుగులో కోడిపండాలు వేస్తున్నా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.