calender_icon.png 14 January, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీలో కోడిపందేల జోరు

14-01-2025 01:24:29 AM

* చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

* విజేతలకు థార్ వాహనం, బుల్లెట్ బండ్లు

* పలు చోట్ల ముందుండి నడిపిస్తున్న ప్రజాప్రతినిధులు

అమరావతి, జనవరి 13: సంక్రాంతి సం బురాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోడి పందేలను జోరుగా నిర్వహిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి కోళ్లకు కత్తులు కట్టి మరి పందేలు నిర్వహిస్తున్నారు. కోడి పందేలను చూడడానికి వచ్చే ప్రజల కోసం కొన్ని చోట్ల ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయడం విశేషం.

పందేలను చూ సేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివెళ్లారు. కోడి పందేలు జోరుగా సాగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్లు చెబుతున్నా రు. కొన్ని చోట్ల విజేతలకు రూ.25లక్షల విలువైన మహీంద్రా థార్ వాహనాన్ని బహుమతిగా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.

కొన్ని చోట్లు బుల్లెట్ బండ్లను బహుమతులుగా ఇస్తున్నట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని ఓ గ్రామంలో కోడి పందేలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. పలు చోట్ల ప్రజాప్రతినిధులే ముందుండి కోడి పందేలను నిర్వహించడం గమనార్హం.