calender_icon.png 14 January, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధ్ర సరిహద్దులో జోరుగా సాగుతున్న కోడి పందాలు, పేకాట...

13-01-2025 10:40:25 PM

ట్రాఫిక్ అంతరాయం నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు... 

బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కిన్నెరసాని ఆంధ్ర సరిహద్దులో నిర్వహించిన సంక్రాంతి సందర్భంగా పేకాట, కోడిపందెలకు వచ్చిన వారు రోడ్డుపై వాహనాలు ఇరువైపులా నిలుపుదల చేయటంలో రాకపోకలు నిలిచి పోయి ప్రయాణికులకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి దగ్గర నుండి చెక్పోస్ట్ వరకు వెళ్లడానికి గంటన్నర సమయం పట్టడంతో జనం నానా అవస్థలు పడ్డారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో సామాన్యులు ఆ వైపు ప్రయాణం చేయాలంటే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రాలో ఆటలు తెలంగాణ వాసుల కీలక పాత్ర తొలిరోజే ఇలా ఉంటే రాబోయే రెండు రోజుల్లో పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్న ప్రయాణికులు ఆ వైపు వచ్చి పోయే వాహనదారులు, సామాన్యులు, అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు స్థానిక వాసులు కోరుతున్నారు.