హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి): ప్రముఖ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రావు ఆధ్వర్యంలో డాక్టర్ రావూస్ ఈఎన్టీ హాస్పిటల్‌లో రెండు రోజుల వ్యవధిలో 10 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతో వినికిడి లోపమున్న ఎంతోమంది చిన్నపిల్లలకు ‘డెఫ్ ఫ్రీ ఇండియా’ సంకల్పం తో రావూస్ ఈఎన్‌టీ దవాఖానా చర్యలు చేపడుతుంది.
పుట్టుకతో వచ్చిన వినికిడిలోపానికి చికిత్స అందించకపోతే ఆ పిల్లలు జీవితాంతం మూగ, చెవుడు పిల్లలుగా మిగిలిపోతారన్నారు. అందుకు రూ.10 లక్షలు ఖర్చయ్యే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని పేదలకు ఉచితంగా చేయించుకునే అవకాశం డాక్టర్ రావూస్ ఈఎన్టీ హాస్పిటల్ కల్పిస్తున్నట్టు డాక్టర్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 200లకు పైగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.