calender_icon.png 8 January, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెటిరో స్కాంలో కోట్లు చేతులు మారాయి

06-01-2025 01:36:08 AM

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాం తి): హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సివిల్ సప్లు అక్రమాలపై ఆధారాలు బయట పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఆదివారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తప్పు ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కొడంగల్ ఎత్తిపోతల టెండర్ల గోల్‌మాల్ వ్యవహారం సంగతేంటని నిలదీశారు. ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకె ళ్లి పోరాడుతామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు అత్యంత నిరాశపరిచాయ ని పేర్కొన్నారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు స్పష్టత లేదని, పింఛన్ల పెంపు, ఆరు గ్యారెంటీలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.