calender_icon.png 16 November, 2024 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు ఉద్యోగులకు గ్రాట్యుటీ కావాలి

24-07-2024 12:00:00 AM

గ్రాట్యుటీ చెల్లింపు 1972 సవరణ చట్టం 29 మార్చి 2018 నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపును 10 లక్షల గరిష్ట పరిమితి నుండి 20 లక్షలకు పెంచారు. కానీ, కేం ద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పెంపుదల చేసిన గ్రాట్యుటీ చెల్లింపులను 01.-01.-2016 నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 01-.01.-2017 నుండి పబ్లిక్ సెక్టార్ అధికారులకు, 29-.03-. 2018 నుండి ఇతర ఉద్యోగులకు వర్తింప చేస్తున్నారు. దీని ప్రకారం 01-.01.-2017 నుండి కోల్ ఇండియా సింగరేణి రిటైర్డ్ అధికారులకు, 29-.03-.2018 నుండి రిటైర్డ్ ఉద్యోగులకు పెంచిన గ్రాట్యుటీ 20 లక్షలు వర్తింపచేస్తున్నారు. ఈ నిర్ణయం భారత రాజ్యాంగ సహజ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. 1998 పెన్షన్ స్కీం అమలులోకి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా పెంపుదల చేయక పోవడం వల్ల బొగ్గు ఉద్యోగులు అతి తక్కువ పింఛన్ పొందుతూ, దయనీయ స్థితిలో ఉన్నారు. కనుక, పబ్లిక్ సెక్టార్ అధికారులకు చెల్లిస్తు న్న విధంగానే బొగ్గు ఉద్యోగులకూ పెంచిన 20 లక్షల గ్రాట్యుటీ 01.-01-.2017 నుండి వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 దండంరాజు రాంచందర్‌రావు, హైదరాబాద్