calender_icon.png 6 November, 2024 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గును తరలించే రైలుకు పచ్చజెండా ఊపిన మంత్రులు

03-11-2024 05:25:22 PM

నల్గొండ,(విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. డిప్యూటీ సీఎం భట్టి పర్యటనలో భాగంగా ఆదివారం దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో చేపడుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమర్ రెడ్డిలతో కలిపి పరిశీలించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ స్టేజి-1లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును గ్రిడ్డు కు అనుసంధానం చేస్తూ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం రామగుండం నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ కు బొగ్గు తరలించే రైలును వైటీపీఎస్ టేక్ ఆఫ్ దగ్గర పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మాట్లాడుతూ...  త్వరలోనే రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీని తీసుకోస్తామని, విద్యుత్ నిష్టాతులు, ప్రజల అభిప్రాయాలపై చర్చించిస్తామని, అందరి అభిప్రాయాలు సేకరించి నూతన పాలసీ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మే నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నామని, 2028-29 నాటికి 22,488 మెగావాట్ల, 2034-35 నాటికి 31,809 మెగావాట్ల చేరొచ్చని భట్టి అంచనా వేశారు. మార్పులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని ప్రవేశపెడుతున్నామన్నారు.