calender_icon.png 21 October, 2024 | 8:33 PM

కేఓసిలో బొగ్గు టిప్పర్ డ్రైవర్ల, క్లీనర్ల సమ్మె..

21-10-2024 05:09:55 PM

ఏడు సంవత్సరాలుగా పెరగని వేతనాలు  

చర్చలకు పిలిచి వాయిదా వేసిన అసోసియేషన్ 

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఉపరితల గని నుంచి బిపిఎల్, నవభారత్, కొత్తగూడెం ఆర్ సిహెచ్ పి, టిప్పర్ల ద్వారా బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా డ్రైవర్ల వేతనాలు పెంచాలని కోరుతూ సోమవారం నిరవధిక సమ్మెకు దిగారు. గత పది నెలల కిందట సమ్మె నోటిస్ ఇచ్చిన వాయిదా పడుతూ వచ్చిందని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, టియు సిఐ యూనియన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాయం వెంకన్న, టిప్పర్ డ్రైవర్ల సమావేశంలో  తెలిపారు.

సమావేశంలో  మాట్లాడుతూ.. టిప్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేకులపల్లి టిప్పర్ కార్యాలయంలో డ్రైవర్ల వేతనాల కోసం సోమవారం మధ్యాహ్నం చర్చలకు యాజమానులే ఆహ్వానించారని తిరిగి చర్చలకు రాకుండా తాత్సారం చేస్తూ ఈనెల 28వ తారీకు నాడు చర్చలు జరపాలని ఫోన్లో మాట్లాడటం వలన డ్రైవర్లు సోమవారం నుంచి నిరవధికంగా సమ్మెలోకి వెళ్తున్నారని వివరించారు. ఇప్పటికైనా టిప్పర్ యాజమానులు, అసోసియేషన్, ఇది నిరవధిక సమ్మేగా మారకముందే పిలిచి చర్చలు జరిపి ఒప్పందం చేయాలని గత పదకొండు నెలలుగా ఓపికతో ఎన్ని వాయిదాలు పెట్టినా సమ్మెకు వెళ్లకుండా సామరస్యంగా చర్చలు జరిపి వేతనాలు పెంచుకోవాలని యూనియన్ నాయకత్వం ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన చివరికి టిప్పర్ అసోసియేషన్ వాళ్లు సమ్మెకు పోయే విధంగా చేస్తున్నారని ఇది మంచిది కాదని వారికి విజ్ఞప్తి చేశారు. వేతన డ్రైవర్ల వేతనాలు పెంచేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమ్మెలో మోటార్ వర్కర్స్, యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి మధార్, చింటు, రాజేష్, చంటి, వీరభద్రం, రమేష్ బాబు, నరసింహారావు, రాజా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.