- వేసవి ఇబ్బందులను అధిగమించాలి
- సింగరేణి సీఎండీ ఎన్.బలరాం
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాం తి): వేసవి ఇబ్బందులను అధిగమిస్తూ, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల డిమాండ్‌కు తగిన విధంగా బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి సీఎండీ బలరాం ఆదేశించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి శనివారం ఆయన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సలహాలు, సూచనలిచ్చారు.
అనుకున్న లక్ష్యా లు నెరవేరలంటే సంస్థ రోజుకు 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, రవాణా చేయా ల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే రోజు కు కనీసం 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలగించాలని, తద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిమాండ్ అధికంగా ఉందని, ఆ ప్లాంట్లకు రోజుకు 11 రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫ రా చేయాలని సూచించారు. బొగ్గు సరఫరా విషయంలో రైల్వే విభాగంతో సమన్వయం చేసుకోవాలని, లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న ఏరియాలు పుంజుకొని పనిచేయాలన్నారు. నాణ్యమైన బొగ్గును మాత్రమే విని యోగదారులకు సరఫరా చేయాలని ఆదేశించారు. గనుల్లో ప్రతి కార్మికుడూ స్వీయ రక్షణ పాటించాలని సూచించారు.