calender_icon.png 1 October, 2024 | 10:54 PM

రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

04-09-2024 01:24:23 AM

  1. కొత్తగా 5 గనుల ప్రారంభానికి సన్నాహాలు 
  2. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరాం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగంగా ఈ నెలలో రోజుకు కనీసం 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్ప త్తి, రవాణా చేయాలని అన్ని ఏరియాల జీఎంలకు సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. మంగళవారం సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో నెలవారి ఉత్పత్తిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నిర్ధేశిత లక్ష్యాలను చేరుకునేందుకు ఇటీవల కురిసిన వర్షాలు కొంత అడ్డంకిగా మారాయని జనరల్ మేనేజర్లు ఆయనకు వివరిం చారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడు తూ ఈ ఏడాది నిర్ధేశించుకున్న 72 మిలియ న్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు.

ఈ ఏడాదిలో ప్రారంభించాల్సిన కొత్తగూడెం వీకే ఓపెన్ కాస్ట్, ఇల్లందు  రొంపేడు, బెల్లంపల్లి, గోలేటి ఓపెన్ కాస్ట్‌లు, రామగుండం కోల్ మైన్‌కు సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఒడిశా లో సింగరేణి సంస్థ ప్రారంభించాల్సిన నైనీ కోల్ బ్లాక్ పై కూడా ఆయన సమీక్షించారు. బ్లాక్ ఉన్న ప్రదేశంలోని చెట్ల గణన, తొలగింపు జరిగితే వెంటనే ఉత్పత్తి ప్రారంభిం చవచ్చని, దీనికోసం అక్కడి అటవీశాఖను ఎప్పటికప్పుడు సంప్రదించాలన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు, ఎన్.వీ.కే.శ్రీనివాస్, జి. వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎస్.డీ. ఎం.సుబానీ, జనరల్ మేనేజర్ (సి.పి.పి) జక్కం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.