భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కారణంగా మూడు రోజులగా ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి కేటికే 2, కేటీకే 3 ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. గనులోకి వరద నీరు చేరడంతో 18వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడడం వల్ల 6 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరడంతో మూడు రోజులుగా 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ అధికారులు తెలిపారు.