calender_icon.png 30 April, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాలో 70% బొగ్గు ఉత్పత్తి

30-04-2025 05:21:38 PM

ఏరియా సింగరేణి జిఎం దేవేందర్...

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలో ఏప్రిల్ మాసానికి గాను నిర్దేశించిన లక్ష్యాలలో 70% బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ తెలిపారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలో ఏప్రిల్ మాసానికి గాను 2.22 లక్షల టన్నులకు గాను 1.55 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. కేకే 5 గనిలో 16000 వేల టన్నులకు గాను 16765 టన్నులు, కాసిపేట గనిలో 19000 టన్నులకు గాను 12248 టన్నులు, కాసిపేట-2 గనిలో 16500 టన్నులకు గాను 12442 టన్నులు, శాంతి ఖనిలో 10 వేల టన్నులకు గాను 1403 టన్నులు, కేకే ఓసిపిలో 1 లక్ష 60 వేల టన్నులకు గాను 112418 టన్నులు సాధించడం జరిగిందన్నారు.

ఏరియాలోని కేకే 5 గనిలో 100 శాతం బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని మిగతా గనుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆన్నారు. కార్మికులు, సూపర్వైజర్లు అధికారుల సమిష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాం సుందర్, ఏరియా ఇంజనీర్ ఈ అండ్ ఎం, వెంకటరమణ, డీజీఎం ఐఈడి రాజన్న, డీజీఎం ఎఫ్& ఎ, ఆర్విఎస్ఆర్కే ప్రసాద్, డివైపిఎం మైత్రేయ బందులు పాల్గొన్నారు.