calender_icon.png 28 February, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాలో 95 శాతం బొగ్గు ఉత్పత్తి

28-02-2025 05:23:12 PM

ఏరియా జి దేవేందర్..

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలో ఫిబ్రవరి మాసానికి గాను నిర్దేశించిన లక్ష్యాలలో 95 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ తెలిపారు. శుక్రవారం జిఎం ఛాంబర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఫిబ్రవరి మాసానికి గాను సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఏరియాలో ఫిబ్రవరి చివరి నాటికి వార్షిక బొగ్గు ఉత్పత్తి 77 శాతం సాధించడం జరిగిందని వార్షిక సంవత్సరం ముగింపుకు మరో నెల రోజుల గదువు మిగిలి ఉందని, నెల రోజుల్లో 100 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించేలా కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు కృషి చేయాలని కోరారు. ఈ ఏరియాలని కేకే 5 గని 110 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగా, కాసిపేట 2 గనిలో 75, కాసిపేట గనిలో 63, శాంతి ఖనిలో 28, కేకే ఓసీపిలో 72 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించ డం జరిగిందన్నారు.

ఏరియాలో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడంలో వెనుకబడి ఉన్నామని అయినప్పటికీ బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్షల అధిగమించేందుకు మరో నెల రోజుల సమయం సమయం ఉందని నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించేందుకు అధికారులు కార్మికులు సూపర్వైజర్లు సమిష్టిగా కృషి చేసి వార్షిక లక్ష్యాలను అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏరియాలోని కేకే 5 గని కార్మికులు 100 శాతం  పైగా ఉత్పత్తి సాధించి అత్యధిక ప్రతిభ కనబరిచారని సాధించిన కార్మికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఉదయస్ఫూర్తిని మిగతా గాని కార్మికులకు ఆదర్శంగా తీసుకొని మెరుగైన ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, డీజీఎం ఐఈడి రాజన్న, సివిల్ ఎస్ఇ రాము, ఇన్చార్జి పర్సనల్ మేనేజర్ మైత్రేయ బందు, డివైపిఎం ఆసిఫ్ లు పాల్గొన్నారు.