calender_icon.png 21 January, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి నుంచి నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి

21-01-2025 01:49:38 AM

  1. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించండి 
  2. ఒడిశా సీఎం మాంఝీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): నైనీ బొగ్గు బ్లాక్‌లో ఈ ఏడాది మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తున్నామని, గని సమీపంలో 1,600 మెగావాట్ల విద్యుదుత్పత్తికి సహకరించాలని డిప్యూటీ మల్లు భట్టివిక్రమార్క సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీని విజ్ఞప్తి కోరారు.

డిప్యూటీ సీఎం ఈ మేరకు కోణార్క్‌లో సోమవారం ఒడిశా సీఎంతో భేటీ పలు అంశాలపై చర్చించి లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. ైనైనీ గనిని తెలంగాణకు దక్కించుకునే విధంగా సీఎం మాంఝీ సహకారం అందించారని కొనియాడారు. నైనీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి చేసిన బొగ్గును 1000 కి.మీ దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లాలోని జైపూర్ 800 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు.

తద్వారా లాజిస్టిక్స్ ఇబ్బందులు ఎద రవుతాయన్నారు. అందుకు పరిష్కార మార్గం గా నైనీ గని సమీపంలో పిట్ హెడ్ ఓవర్ ప్లాంట్‌గా ఒడిశా ప్రభుత్వం మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాంట్ పూర్తయితే ఉత్పత్తి వ్యయం అమాంతం తగ్గుతుందని వెల్లడించారు.

రానున్న మూడు దశాబ్దాల పాటు థర్మల్ విద్యుత్‌కు భారీ డిమాండ్ ఉంటుందని, గనులకు దగ్గరగా కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లను స్థాపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రవాణా ఖర్చు తగ్గించడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పర్యావరణ పరిరక్షణ అంశాల నేపథ్యంలో గని సమీపంలో సింగరేణి యాజమాన్యం 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించేందుకు తగినంత భూమి కేటాయించాలని  కోరారు.