calender_icon.png 4 January, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు ఏరియాలో డిసెంబర్ నెలలో 118 శాతం బొగ్గు ఉత్పత్తి

01-01-2025 07:18:07 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జిఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఏరియా జి.యం కృష్ణయ్య తెలిపారు. డిసెంబర్-2024 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 3.32 లక్షల టన్నులకు గాను 3.91 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 118 శాతం ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. అలాగే 2.05 లక్షల టన్నుల బొగ్గు రైల్వే మార్గం ద్వారా, 0.41 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా, ఆర్.సి.హెచ్.పి ద్వారా 1.24  ఇల్లందు ఏరియాలో మొత్తం 3.70 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేయడం జరిగింది. డిసెంబర్ నెలలో 54 రేకుల ద్వారా బొగ్గు రవాణా చేసామని తెలిపారు.

అదేవిధంగా ఇల్లందు ఏరియాకు కేటయించిన వార్షిక బొగ్గు లక్ష్యం 26.43 లక్షల టన్నులకు గాను 33.01లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 125 శాతంతో అన్ని ఏరియాల కంటే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన సంబంధిత అధికారులు, సూపర్వైజర్స్, యూనియన్ నాయకులకు, ఉద్యోగులకు జి.యం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్ఓటూ జియం బొల్లం వెంకటేశ్వర్లు, ఎజియం(ఐఇ) గిరిధర్ రావు, డిజియం పర్సనల్ జివి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.