16-04-2025 01:57:33 AM
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : సుమారు 13 దశాబ్దాల చరిత్రలో మరో రాష్ట్రంలోని సింగరేణి తొలి బ్లాక్ ‘నైనీ’లో బుధవారం నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానున్నది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సంస్థ సీఎండీ ఎన్ బలరాం బొ గ్గు ఉత్పత్తి పనులను ప్రారంభించనున్నారు.
ఒడిశాలోని అంగూల్ జిల్లా పరిధిలో ఉంటు ందీ గని. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 2016 మేలో గనిని సింగరేణికి కేటాయించినప్పటికీ, అన్ని రకాల అనుమతుల సాధనకు ఇంత సమయం ప ట్టింది.
38 ఏళ్ల పాటు ఉత్పత్తి..
నైనీ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి యాజమాన్యం తేల్చింది. సంస్థ పరిధిలోని మొత్తం 17 ఓసీల్లో ఇదే అతిపెద్ద ఓసీ కావడం విశేషం. సంస్థ ఇక్కడి నుంచి ఏడాదికి 10 మిలియన్ టన్నుల చొప్పున 38 ఏళ్ల పాటు బొగ్గును వెలికి తీయనున్నది. ఈ ఓసీ నుంచి నాణ్యమైన ‘జీ- 10’ బొగ్గు ఉత్పత్తి అవుతుందని, ఓవర్ బర్డెన్ కూడా చాలా తక్కువ శాతంలో ఉంటుందని ఇప్పటికే సంస్థ తేల్చింది.