సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో బొగ్గు గనుల ప్రైవేటీక రణను వ్యతిరేకిస్తూ సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పలువురు సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. బొగ్గు గనులను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నర్సింహరావు, నగర కార్యవర్గ సభ్యులు ఎం దశరథ్, ఎం మహేందర్ పాల్గొన్నారు.