calender_icon.png 5 March, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అథ్లెట్, ఇర్పా సుష్మారాణికి సన్మానం

05-03-2025 01:01:43 AM

 కొత్తగూడెం మార్చి 4 (విజయ క్రాంతి): కోల్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ కంపెనీ అథ్లెటిక్స్ టోర్నమెంట్ కార్పొరేట్ ఆధ్వ ర్యం లో నిర్వహించారు.  కొత్తగూడెం ఏరియా నుండి పోటీలకు హాజరై అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ఇర్పా సుష్మారాణిని మంగళ వారం, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు, జిఎం చాంబర్ లో శాలువాతో సన్మానించారు.  ఏరియా జిఎం మాట్లాడుతూ, ఇర్పా సుష్మారాణి, కొత్తగూడెం ఏరియా నుండి పాల్గొని లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, 4X100 పరుగు పందెంలలో మూడు సిల్వర్ బహుమతు లను గెలుపొంది, 

100 మీటర్ల పరుగు పందెం నందు కాంస్య పథకం గెలుపొం దిందన్నారు. సింగరేణి క్రీడా ఉద్యో గులు పాల్గొని, కంపెనీకి, పేరు తెచ్చిన ప్రతి ఒక్కరికి   ముఖ్యంగా, కొత్తగూడెం ఏరియా లో నుండి ఇర్పా సుష్మారాణి పాల్గొని పథకాలు సంపా దించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.  కొత్తగూడెం ఏరియా జిఎంతో పాటు ఎస్‌ఓటుజిఎం జీవీ కోటిరెడ్డి, డీజిఎం (పర్సనల్) బి. శివకేశవరావు, ఏరియా ఎస్టేట్స్ ఆఫీసర్ బి తౌర్య,  ఎస్టేట్స్ ఆఫీసర్ ఎం.శ్రీనివాస్,  కొత్తగూడెం ఏరియా స్పోరట్స్ మెంబర్ సిహెచ్ సాగర్ ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది.