calender_icon.png 25 October, 2024 | 2:52 AM

యువత కోసం కోచింగ్ సెంటర్లు

25-10-2024 01:02:41 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ  నరేందర్ రెడ్డి

కరీంనగర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే యువత కోసం స్వచ్ఛందంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉచిత ఓటరు నమోదు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 2021 నాటికి అంతకుముందు పట్టభద్రులై ఉన్నవారు వచ్చే నెల 6 వరకు ఓటరుగా ఎన్‌రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు సులభతరం చేసేందుకు ఇప్పటికే మిస్డ్‌కాల్ క్యాంపెయిన్ ప్రారంభించామని తెలిపారు.

ప్రతి నియోజకవర్గ పరిధిలో తమ ప్రతినిధులు కేంద్రాలు ఏర్పాటు ఏసి అందుబాటులో ఉంటారని, ఓటర్‌గా ఎన్‌రోల్ చేసుకోవాలకునేవారు అప్లికేషన్‌తో పాటు వారి ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు తమ ప్రతినిధులకు అందజేస్తే వారే ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్ చేస్తారని తెలిపారు. తాను గెలిస్తే ప్రభుత్వానికి వారధిగా నిలిచి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.