calender_icon.png 6 October, 2024 | 5:56 AM

యువత కోసం కోచింగ్ సెంటర్లు

06-10-2024 12:20:54 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్‌రెడ్డి

కరీంనగర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత తనపై ఉన్నదని, యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఉచిత కోచింగ్ సెంటర్లను నెలకొల్పుతానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేంరద్‌రెడ్డి అన్నారు. శనివారం చొప్పదండి పట్టణంలో పర్యటించారు.

పలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించి ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు పలుకాలని ఓరారు. తనసొంత ఖర్చుతో ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి జిల్లా కేంద్రంలో కోచింగ్ సెటర్లను నెలకొల్పుతానని అన్నారు.