calender_icon.png 7 November, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోచింగ్ సెంటర్లు.. డెత్ చాంబర్లు

06-08-2024 02:32:23 AM

సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతిపై విస్మయం

అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడిన ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ‘సివిల్ సర్వెంట్ కావాలని ఢిల్లీ వస్తున్న యువతీ యువకుల జీవితాలతో కోచింగ్ సెంటర్ల యాజమాన్యా లు ఆడుకుంటున్నాయి. కోచింగ్ సెంటర్లలో వసతులు దారుణంగా ఉంటున్నాయి. అవి డెత్ చాంబర్లు (మృత్యుకుహరాలు)గా మారా యి.

వాటిని నియంత్రించడంలో యంత్రాం గం పూర్తిగా విఫలమైంది’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోకి వరద చేరి, నీటమునిగి ముగ్గురు అభ్యర్థుల మృతిని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది.

వందలాది మంది అభ్యర్థుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేసి నిర్వాహకులు వారికి సరైన వసతులు కల్పించకపోవడం ఏమిటని ప్రశ్నించిం ది. సరైన వసతులు కల్పించే వరకు అభ్యర్థులకు ఆన్‌లైన్ విధానంలో తరగతులు చెప్పొ చ్చు కదా.. అని సూచించింది.

భవన నిర్మాణానికి అగ్నిమాపకశాఖ అధికారులకు అబద్ధాలు చెప్పి అనుమతులు తీసుకోవడం, తరగతుల నిర్వహణకు బహుళ అంతస్థుల సెల్లార్‌ను వినియోగించడం ఏమిటని దుయ్యబట్టింది. ప్రతి కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిబంధనలు పాటిస్తూ, అభ్యర్థులకు మెరుగైన వసతు లు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

కోచిం గ్ సెంటర్లపై నిఘా లేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని మందలించింది. నిర్వాహకుల నుంచి ఎలాంటి పన్ను వసూలు చేయకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, ఉచితాలను ప్రోత్సహించడం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని భవనాలు నిర్మించడం అనర్థాలకు దారి తీస్తుందని అభిప్రా యపడింది.

కుంభవృష్టి కురిసి వరదలు వస్తే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉందని స్పష్టం చేసింది. పౌరుల భద్రత కల్పించడంలో కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందన్నది. 

కోచింగ్ సెంటర్స్ ఫెడరేషన్‌కు రూ.లక్ష జరిమానా

నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లను వెంటనే మూసివేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కోచింగ్ సెంటర్స్ ఫెడరేషన్ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. అంతేకాదు పిటిషన్ వేసినందుకు ఫెడరేషన్‌కు రూ.లక్ష జరిమానా విధించిం ది.

అనంతరం ఏ నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయో వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిం ది. మరోవైపు ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లలో పోలీసులు, మున్సిపల్, అగ్నిమా పకశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు పాటించని 35కి పైగా కోచింగ్ సెంటర్లను మూసివేయించారు.