calender_icon.png 31 October, 2024 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతకం రాలేదని కోచ్ రాజీనామా

04-08-2024 12:30:53 AM

పారిస్: విశ్వక్రీడల్లో కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న భారత డబు ల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్‌ెేచిరాగ్ శెట్టి జోడీ నిరాశపరిచింది. కానీ ఊహించని విధంగా క్వార్టర్ ఫైనల్లో మలేషియా జంట చేతిలో పరాజయం పాలైన సాత్వి క్ జోడీ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. తాజాగా సాత్విక్ జోడీకి మరో షాక్ తగిలింది. సుదీర్ఘకాలంగా వారికి శిక్షణ ఇస్తున్న కోచ్ మథియాస్ బో కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.  సాత్విక్ జోడీ ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. డెన్మార్క్‌కు చెందిన ఈ దిగ్గజం ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను భర్త కావడం విశేషం. కాగా మథియాస్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో డెన్మార్క్ తరఫున పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో రజత పతకం సాధించా డు. ఇతని హయాంలోనే సాత్విక్ జోడీ డబుల్స్‌లో నంబర్‌వన్‌గా అవతరించడమే గాక అంతర్జాతీయ స్థాయిలో చాలా టైటిళ్లను సొంతం చేసుకుంది.