హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (విజయక్రాంతి): బోయిన్‌పల్లిలోని హస్మత్‌పేట రోడ్డులో ఆదర్శ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతన శాఖ(26వ బ్రాంచి)ను ఆర్బీఐ విశ్రాంత మేనేజర్ శశిధర్ శాస్త్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ బ్యాంక్ చైర్మన్ మదనగోపాలస్వామి మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు కొత్తగా బ్రాంచిని ప్రారంభిం చామన్నారు.
చిన్న, మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులకు చేయూతనిచ్చేలాగా ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ మొత్తపు అప్పు లు.. అధే విధంగా పూచీకత్తు సమర్పించిన వారి వ్యాపార అభివృద్ధి, అవసరాలకు అనుగుణంగా అప్పులు ఇస్తున్నట్లు తెలిపారు. తమ బ్యాంక్‌లో లాకర్ సౌకర్యం కూడా ఉందన్నారు.
అన్ని వర్గాల మదుపుదారులకు, సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయ మైన వడ్డీ రేట్లు అందిస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదర్శ్ బ్యాంక్ డైరెక్టర్ ఆదిత్య, మాజీ చైర్మన్ చిలుకూరి గంగారావు, సీఈఓ ఎంవీ రమణ, ఎజీయంలు అయ్యప్పనాయుడు, కామినేని శ్రీనివాసరావు, నూతన బ్రాంచ్ మేనేజర్ ఎం వెంకటేశం, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.