calender_icon.png 16 January, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగాధరలో సహకార బ్యాంకు ప్రారంభం

23-09-2024 12:05:16 AM

కరీంనగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సహకార బ్యాంకు సేవలను సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్ప తి అన్నారు. ఆదివారం గంగాధర మండల కేంద్రంలో కరీంనగర్ సహకార అర్బన్ బ్యా ంకు శాఖను ఆమె ప్రారంభించారు. సహకా ర బ్యాంకులతో ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో రె ండవ బ్రాంచ్‌గా గంగాధరలో సహకార అ ర్బన్ బ్యాంకు సేవలు అందించనున్నదని తె లిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా స హకార అధికారి రామానుజాచార్య, కరీంనగర్ అర్బన్ బ్యాంకు అసోసియేట్ చైర్మన్ గ డ్డం విలాస్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు మడుపు మోహన్, భాస్కర్, బీరం ఆంజనేయులు, రేగొండ సందీప్, మూల లక్ష్మివిద్యాసాగర్, లక్ష్మణ్‌రాజు, సంయుద్దీన్, మంగి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.