calender_icon.png 19 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి అండర్ 14 ఫుట్‌బాల్ పోటీలలో సీఎన్‌ఆర్ విద్యార్థుల ప్రతిభ

18-03-2025 12:00:00 AM

నాగర్ కర్నూల్ మార్చి 17 విజయక్రాంతి: ఈనెల  14, 15, 16 తేదీలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వనపర్తిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ 14 ఫుట్బాల్ బాల బాలికల పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సిఎన్‌ఆర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్తి టి.యక్షిత్, 7వ తరగతి చదువుతున్న త్రిశిలేశ్వర్ ఇద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

ఫలితంగా రాష్ట్రస్థాయిలోని 10 జిల్లాల క్రీడాకారులు పాల్గొనగా ఫైనల్లో హైదరాబాద్ జట్టుతో తలపడి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్లు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల అధ్యాపక బృందం జిల్లావాసులు అభినందించారు.