న్యూఢిల్లీ: సీఎన్‌జీ వాహనదారులకు గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. సీఎన్‌జీ రిటైల్ ధరలను సవరించాయి. ముంబయిసహా నగరాల్లో కిలో 2 రూపాయల చొప్పు న పెంచాయి. అయితే ఢిల్లీని మాత్రం ఈ పెంపునుంచి మినహాయించాయి. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం ఇందుకు కారణం. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా చుట్టుపక్కలు నగరాల్లో ఆటోమొల్‌లో ఉపయోగించే సీఎన్‌జీని, గృహ అవసరాలకు వినియోగించే పైప్ గ్యాస్‌ను సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటడ్ సీఎన్‌జీ ధరను కిలోకు రూ.2 మేర పెంచింది.
నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ నగరాల్లో ఈ పెంపు చేపట్టిన సంస్థ ఢిల్లీని మాత్రం మినహాయించింది. మహారాష్ట్ర అసెంబ్ల్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ముంబైలో సీఎన్‌జీ విక్రయించే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ కూడా కిలోకు రూ.2 చొప్పున పెంచింది. గత రెండు నెలలుగా ధరలను స్థిరంగా ఉంచిన అదానీ టోటల్ సైతం సీఎన్‌జీ ధరను పెంచింది. దీంతో కిలో సీఎన్‌జీ ధర ముంబైలో రూ.77కు చేరింది. ఇతర నగరాల్లో కూడా సీఎన్‌జీ రిటైలర్లు సెన్‌జీ ధరల పెంపును చేపట్టాయి.