అగ్నికీలల్లో 11 మంది మృతి పలువురికి గాయాలు
జైపూర్, డిసెంబర్ 20: జైపూర్‌లోని అజ్మీర్‌రోడ్‌లో శుక్రవారం తెల్లవారుజాము న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీఎన్‌జీ గ్యాస్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు పే లింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ట్యాంకర్‌తో చుట్టుపక్కన ఉన్న మరో ౩0 వాహనా లు దగ్ధమయ్యాయి.
అగ్నికీలల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనమయ్యా రు. పలువురు గాయపడ్డారు. కొన్నిగంటల పాటు మంటలు ఎగసిపడటంతో ట్రాఫిక్ జాం అ యింది. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో కొన్నిగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన సంభవించిన సమీపంలో ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది. మంటలు అక్కడి వరకు వ్యాపించకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.