కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం డిసిసి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కోక్కిరాల విశ్వప్రసాద్ రావు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం కోసం సీఎం ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మసాదె చరణ్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, మార్కేట్ కమిటీ మాజీ చైర్మన్ గాదవేణి మల్లేష్, గుండి మాజీ సర్పంచ్ సెండే దత్తు, జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గుండా శ్యామ్, జమీర్, ఆసిఫ్, జాకీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.