16-04-2025 02:13:41 AM
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమం చేసింది.
ఈ నేపథ్యంలో మరోమారు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్ లో పర్యటించనుంది. బుధవారం నుంచి 22వ తేదీ వరకు పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు. మంగళవారం రాత్రి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు అధికారులు బృందం జపాన్‌కు బయలుదేరుతారని సీఎంవో అధికారులు తెలిపారు.
పర్యటన వివరాలు..
* 16న జపాన్‌లోని టోక్యోకు చేరుకొని భారత రాయబారితో ఆతిథ్య భేటీ కానున్నారు.
* 17వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వర కు టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేష నల్ కో ఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపా న్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్, వివిధ సంస్థ ల ప్రతినిధులతో సమావేశమవుతారు. సా యంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు.
* 18న టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, టోక్యో గవర్నర్‌తో సమా వేశం నిర్వహిస్తారు. అనంతరం ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతిని ధుల తో భేటీ అవుతారు. టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్జీటీ తదితర కంపనీల సీఈవోలతో వేర్వేరుగా సమావేశాలు, జపాన్ ఓవర్సీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం సుమిదా రివర్ ఫ్రంట్ సందర్శన
* 19వ తేదీన టోక్యో నుంచి ఒసాకా చేరుకొని అక్కడ మౌంట్ ఫుజి ప్రాంతాన్ని, అరకురయామా పార్క్‌ను సందర్శిస్తారు.
* 20వ తేదీన ఒసాకాలో కిటాక్యూషు మేయర్‌తో సమావేశం, ఎకో టౌన్ ప్రాజెక్ట్‌కు సం బంధించిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మురసాకి రివర్ మ్యూజి యం, ఎన్విరాన్‌మెంట్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్‌ను సందర్శిస్తారు.
* 21వ తేదీన ఒసాకాలోని యుమెషియాలో వరల్డ్ ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం, ఒసాకా రివర్ ఫ్రంట్ సందర్శన.
* 22వ తేదీన ఒసాకా నుంచి హిరోషిమా చేరుకొని హిరోషిమా పీస్ మెమోరియల్‌ను సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌తో సమావేశమవు తారు. హిరోషిమా జపాన్ - ఇండియా చాప్టర్‌తో బిజినెస్ లంచ్ అనంతరం హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీ సందర్శిస్తారు. అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 23న ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు.