calender_icon.png 9 April, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు సన్నబువ్వ

07-04-2025 01:05:11 AM

  1. రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో రేవంత్‌రెడ్డి భోజనం
  2. తాళ్లగొమ్మూరులో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల సందడి
  3. ఆతిథ్యమిచ్చిన కుటుంబానికి సీఎం కృతజ్ఞతలు

బూర్గంపహాడ్, ఏప్రిల్ 6: భద్రాద్రి జిల్లా భద్రాచలం పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ఆది వారం జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. అనంతరం బూర్గంపహాడ్ మండ లం తాళ్లగొమ్మూరులోని ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రేషన్ లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ ఆతిథ్యం స్వీకరించారు.

శ్రీనివాస్ కుటుంబసభ్యులు వండిన సన్నబియ్యం అన్నంతో పాటు పాయ సం, పులిహోర, సేంద్రియ ఎరువులతో పండించిన తోటకూర, పప్పు, గోంగూర పచ్చడి, బెల్లం పాన కం, వడపప్పును డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావుతో కలిసి ఆరగించారు.

అనంతరం సీఎం ఆతిథ్యం ఇచ్చిన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత సీఎం మాట్లాడుతూ.. పేదల కడుపు నింపేందుకే తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి శ్రీకా రం చుట్టిందన్నారు. పథకం ద్వారా 80 శాతానికి పైగా బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుపేద ప్రజలు లబ్ధిపొందుతున్నారని అన్నారు. అనంతరం బూరం శ్రీనివాస్ తల్లి శంకరమ్మ తన భర్త జీసీసీ సేల్స్‌మెన్‌గా పనిచేసి..

2015లో పదవీ విరమణ చేశాడని, తన కుమారుడు శ్రీనివాస్ ఎంఏ, బీఈడీ చదివి కూలి పనులు చేసుకుంటున్నాడని విన్నవించింది. కుమార్తె మానసిక దివ్యాంగురాలని, తాను కంటిచూపు సమస్యతో అవస్థలు పడుతున్నానని సీఎంకు తెలిపింది. తమ కుటుంబ సమస్యలకు పరిష్కా రం చూపాలని కోరింది. సీఎం స్పందించి.. వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్‌ను ఆదేశించారు. వారి వెంట ఎస్పీ రోహిత్ రాజ్‌తదితరులు ఉన్నారు.