calender_icon.png 28 February, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

28-02-2025 02:07:54 AM

  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
  • అధికారులతో కలెక్టర్ సమీక్ష  సమావేశం 

వనపర్తి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి):  మార్చి, 2న  రాష్ర్ట ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  రాష్ర్ట ముఖ్యమంత్రి జిల్లా  పర్యటన ఏర్పాట్లపై  గురువారం ఐ.డి. ఒ .సి సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2న రాష్ర్ట ముఖ్యమంత్రి వనపర్తి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని, పర్యటనను విజయవంతం చేసేందుకు   పకడ్బందీగా  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రారంభోత్సవాలకు శిలా ఫలకాల ఏర్పాటు, బహి రంగ సభకు కావలసిన ఏర్పాట్లను చర్చించారు.

బహిరంగ సభకు విచ్చేసే ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముంద స్తు ప్రణాళికలు చేసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు బాధ్యతలను మున్సిపల్ కమిషనర్‌కు అప్పగించారు. అధికా రులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించా రు.

ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ర్టంలో, జిల్లాలో జరిగిన వివిధ  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన - ప్రగతి బాట కార్యక్రమంలో  రాష్ర్ట ముఖ్యమంత్రి  ప్రసంగించనున్న నేపథ్యంలో మహిళా సమాఖ్య, మెప్ప్మ  మహిళలను సభాస్థలికి సురక్షితంగా  తరలించి తిరిగి వారి ఇళ్లకు పంపిం చడానికి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు.

మండలాల వారీగా  బస్సులు కేటాయించడం జరిగిందని  సభ కు వచ్చే వారికి భోజనం, మంచినీరు,  మజ్జిగ వంటి కనీస సౌకర్యాలు పకడ్బందీగా  చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి సంచిత్  గంగ్వార్,  యాద య్య,  ఆర్డీఓ సుబ్రమణ్యం, పి.డి. డిఆర్డీఓ ఉమాదేవి, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఒలు పాల్గొన్నారు.