calender_icon.png 5 December, 2024 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్‌పై సీఎం ప్రత్యేక దృష్టి

25-09-2024 01:07:12 AM

జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి కొండా సురేఖ

హనుమకొండ, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ తర్వాత వరంగల్ అభి వృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారి ంచారని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మం త్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆ మె పాల్గొన్నారు.

ఆ తర్వాత మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవం త్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్య, వైద్యం, అభివృ ద్ధి, సంక్షేమాలపై ముందుకెళ్తున్నట్లు తెలిపా రు. లక్షల కోట్లు మింగిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ ం అప్పుల కుప్పతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చే తిలో పెట్టిందని విమర్శించారు. అయినప్పటికీ ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనా లు సకాలంలో ఇస్తున్నట్లు తెలిపారు.

సంక్షే మ పథకాలు ప్రజలకు అందజేస్తున్నట్లు చె ప్పారు. గ్రేటర్ వరంగల్  కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. నగరంలో అం డర్ గ్రౌండ్ డ్రై నేజీ వ్యవస్థను ఏర్పాటు చేసే ందుకు నిర్ణయించినట్లు తెలిపారు. వా నాకాలంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులను అడ్డుకునేందుకు ప్రత్యే క టీంను ఏర్పాటు చేశామన్నారు.

నగరంలో అక్రమాలకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తి ంచి నోటీసులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగరంలో అన్ని చెరువులను అభివృద్ధి చేసేది శగా తీర్మాణం చేసినట్లు తెలిపారు.

మామూనూర్‌లో త్వర లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకునేలా తీర్మాణం చేసినట్లు తెలిపారు. కాళో జీ కళాక్షేత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశం లో ఎమ్మె ల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరా జు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.