ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. దవాఖాన రహదారుల నిర్మాణానికి తక్షణమే సర్వే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిశోర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.