30-03-2025 12:32:30 AM
సన్న బియ్యం పంపిణీని ప్రారంభించనున్న రేవంత్‌రెడ్డి
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సభా వేదికను పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సూర్యాపేట, మార్చి 29 (విజయక్రాంతి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో నేడు నిర్వహించే సభావేదిక నుంచే సన్న బియ్యం పంపిణీ కార్యాక్రమం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను శనివారం అధికారులు పూర్తి చేశారు. సభావేదికను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 1,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు సుమారు 50 వేల మంది వచ్చే అవకాశం ఉంది.