calender_icon.png 31 October, 2024 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాభవన్‌లో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

06-07-2024 08:11:14 PM

హైదరాబాద్ :  రెండు రాష్ట్రాల అపరిష్కృత సమస్యలపై శనివారం సాయంత్రం ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో 10 కీలక అంశాలపై చర్చించారు.

విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తుల విభజనపై, విభజన చట్టంలో లేని సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చలు కొనసాగింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, విద్యత్ బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు, ఏపీ - తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడి రెండు రాష్ట్రాల మధ్య లేబర్ సెస్ పంపకాలపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించారు.

భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన ఏడు మండలాల్లోని 5 గ్రామాలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.  ఈ విషయంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు.  కాగా.. చర్చకు మందు కాళోజీ రాసిన 'నా గొడవ' పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీ సీఎం చంద్రబాబుకు బహుకరించాడు.