calender_icon.png 31 March, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సభ చరిత్రాత్మక సభగా నిలవాలి

29-03-2025 02:38:28 AM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజుర్ నగర్,మార్చి 28: ఉగాది పర్వదినం రోజున హుజుర్నగర్ లో నిర్వహించ తలపెట్టిన సభ చరిత్రలోనే చారిత్రాత్మకంగా నిలిచి పోతుందని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద లందరికి సన్న బియ్యం పంపిణీ అన్నది దేశ చరిత్రలోనే ఒక మైలు రాయి లాంటిదని ఆయన కొనియాడారు.

అటువంటి సన్నబియ్యం  పంపిణి ప్రారంభోత్సవ కార్యక్రమం హుజుర్నగర్ కేంద్రంగా జరగడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావిస్తునన్నారు. ఈ నెల 30 న ఉగా ది పర్వదినాన్ని పురస్కరించు కుని సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతు ల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించ నున్న విషయం విది తమే.

ఈ సందర్భంగా  రాజీవ్ గాంధీ ప్రాంగణం వేదికగా జరప తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట ఐ. జి.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్  పవార్, ఎస్.పి నరసింహ పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్, క్యాడర్ తో సభా ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నిరుపేదల కడుపు నింపేందుకు గాను ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణి కార్యక్రమం ఇక్కడి నుండి ప్రారంబించుకోవడం ఒక అద్భుతమైన ఘట్టాన్ని అవిష్కరించబోతుందన్నారు.అటువంటి అద్భుతమైన ఘట్టంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయి రాష్ట్ర జనాభాలో 84 శాతానికి అందించ బోతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ  తరలి రావాలని మంత్రి  పిలుపునిచ్చారు.