calender_icon.png 21 November, 2024 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలబాలికలకు సీఎం శుభాకాంక్షలు

14-11-2024 12:35:37 AM

‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా నేడు విద్యార్థులతో మాక్ అసెంబ్లీ

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణ బాలబాలికలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఓ ప్రకటనలో సీఎం సందేశమిస్తూ.. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకొంటామని, బాలలు నెహ్రూ దేశానికి అందించిన సేవల గురించి తెలుసుకోవాలని సూచించారు.

బాలల చదువుపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.  పిల్లలకు మెరుగైన విద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. విద్యావ్యవస్థలో సంస్కరణల కోసమే విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని ప్రకటించారు.

ఏకీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టామన్నారు. కాగా, బాలల దినోత్సవం సందర్భంగా గురువారం సీఎం రాష్ట్ర విద్యాశాఖ, అండర్ 18 సంస్థ సంయుక్తంగా హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ గోదావరి హాల్‌లో 105 మంది విద్యార్థులతో నిర్వహించనున్న ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమానికి సీఎం విచ్చేయనున్నారు. 

నెహ్రూ సేవలు చిరస్మరణీయం మంత్రి సీతక్క 

హైదరాబాద్, నవంబర్ 13 (విజయ క్రాంతి) : బాలల దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక భారతదేశం కోసం నెహ్రూ చేసిన సేవలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. దేశాన్ని వెనుకబాటుతనం నుంచి వికాసం వైపు నడిపించిన నెహ్రూ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పిల్లలను జాతి సంపదగా నెహ్రూ భావించారన్నారు.