02-03-2025 12:34:21 AM
రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా..
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు.. ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు.
లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంద ని, ముస్లింల అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం భరోసానిచ్చారు.
కేసీఆర్ శుభాకాంక్షలు
రంజాన్ మాసం ప్రారం భం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. లౌకిక వాద స్ఫూర్తిని, గంగా జమున వారసత్వాన్ని కొనసాగిద్దామ న్నారు. దేవుని దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, జీవిత పరమార్థాన్ని తెలియపరిచి, క్రమశి క్షణను పెంపొందిస్తాయన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు.