calender_icon.png 16 January, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషి

05-07-2024 12:05:00 AM

  • పెండింగ్ బిల్లుల విడుదలకు కృషి చేస్తా 
  • ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి

జగిత్యాల, జూలై 4 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల మండల పరిషత్ సభ్యుల వీడ్కోలు సభకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సామాజిక తెలంగాణ రాష్ర్ట నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారని, ప్రజలు భాగసాములు కావాలని  పిలుపునిచ్చా రు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చులు రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షలకు సీఎం రేవంత్‌రెడ్డి పెంచారని చెప్పారు. గ్రామాల్లో మాజీ సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబం ధించి సీఎంతో మాట్లాడి బిల్లుల విడుదలకు కృషి చేస్తానన్నారు. 

ఫ్లెక్సీ తొలగించిన అధికారులపై ఫైర్

జగిత్యాల పట్టణం 8వ వార్డు బేడ బుడగ జంగాల కాలనీలో బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీ ని గురువారం ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీని తొలగించడంతో ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఎందుకు తొలగించారని సిబ్బందిని నిలదీశారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సంజయ్ ఫొటో లేనందుకే తొలగించారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫ్లెక్సీని ఎవరు తొలగించమన్నారని ప్రశ్నించారు. టీపీవో తేజసిని చెప్పార ని వెల్లడించగానే ఆగ్రహించిన ఎమ్మె ల్సీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.