calender_icon.png 5 November, 2024 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ అభివృద్ధికి సీఎం కృషి

01-07-2024 12:05:00 AM

  • సీఎం ఓఎస్డీ శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, జూన్30 (విజయక్రాంతి): వేములవాడ ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారని  సీఎం  ఓఎస్డీ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం  తిప్పాపూర్‌లోని గోశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోడెల సంరక్షణకు చేపటాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. స్వామివారిని దర్శించుకున్న అనంత రం ప్రభుత విప్ ఆది శ్రీనివాస్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. భక్తులు ఎంతో విశాసంతో చెల్లించుకునే కోడె మొక్కుల పట్ల ముఖ్యమంత్రికి పూర్తి విశాసం, నమ్మకం ఉన్నదని, కోడెల దీనస్థితిని అధ్యయనం చేసే క్రమంలో ఇప్పటికే  ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎండోమెంట్ కమిషనర్ గోశాలను సందరించారని తెలిపారు.

కోడెల సంరక్షణకు ఇప్పుడు ఉన్న ఏడు షెడ్లకు అదనంగా మరో రెండు షెడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గోశాల అభివృద్ధికి ఇంకెన్ని నిధులు కావాలన్నా ఇచ్చేం దుకు ప్రభుతం సిద్ధంగా ఉందని అన్నారు. కోడెలకు పౌష్టికాహారం అందించడం, వైద్యం కోసం వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామ న్నారు. వీలైతే కోడెలను మఠాలకు, గుర్తింపు పొందిన గోశాలలకు, వ్యవసాయం చేసే రైతులకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కోడె మొక్కులు చెల్లించుకునే భక్తులు ఆరోగ్యంగా, పాలు మరచిన, నిర్ణీత వయసు నిండిన కోడెలను మాత్రమే సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట ఆలయ ఈవో రామకృష్ణ ఉన్నారు.