calender_icon.png 21 April, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండలో సీఎం దిష్టిబొమ్మ దహనం

04-04-2025 01:14:32 AM

నల్లగొండ, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : హెచ్సీయూలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ బీజేవైఎం నాయకులు నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీ భూములు, పర్యావరణం, వన్యప్రాణులను రక్షించాల్సిన ప్రభుత్వం పైశాచికంగా ప్రకృతి విధ్వంసం సృష్టిస్తున్నదని మండిపడ్డారు.

హెచ్సీయూ భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ప్రొఫెసర్లను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. లాఠీచార్జికి బాధ్యతవహిస్తూ విద్యార్థులకు సీఎం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

400 ఎకరాల వర్సిటీ భూముల్లో చెట్లను నరికి మూగజీవాలకు ఆవాసం లేకుండా చేసిన సర్కారు దుష్ట వైఖరిని ఖండిస్తున్నా మన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్ రెడ్డి, దిండు భాస్కర్ గౌడ్, పట్టణాధ్యక్షుడు దుబ్బాక సాయి కిరణ్, జిల్లా కార్యదర్శి గుండెబో యిన శాంతిస్వరూప్, మిర్యాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.