calender_icon.png 14 November, 2024 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణపై సీఎం నిర్ణయం సరికాదు

11-11-2024 01:44:53 AM

  1. సుప్ట్రీంకోర్టు తీర్పుతో మాల జాతిలో అభద్రత 
  2. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం సరికాదని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో జరిగిన మాలల ఆత్మగౌరవసభలో ఆయన సంచలన వాఖ్యలు చేశారు. మాలల ఎదుగుదలను అణిచివేసే కుట్రలు జరుగుతున్నా యని, వాటిని ఎదుర్కోవల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్ట్రీకోర్టు తీర్పు వచ్చాక మాల జాతిలో అభద్రతా భావం నెలకొన్నదన్నారు. మాల ఉద్యోగులపై ఏసీబీ దాడులు పెరిగాయని ఆరోపించారు.

అన్ని రాజకీయ పార్టీలకు మాలల సత్తా తెలిసేలా ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఐక్యత సాధించడానికి తమ నాన్న వెంకటస్వామి స్ఫూర్తితో బయటకు వచ్చానని వివేక్ అన్నారు. ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ దాడులతో తనను బయపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. డిసెంబర్ 1న హైదారాబాద్‌లో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని పిలువునిచ్చారు.

ఈ సమావేశంలో మాల మహా నాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, నాయకులు అల్క కిషన్, ఎడ్ల నాగరాజు, అమృత్, విజయ్, మోహన్‌రావు, వాగ్‌మారె సుభాష్, ఎడ్ల సంజీవయ్య, చొక్కంద దేవిదాస్, అంగడి ప్రదీప్, రాంచందర్, ఎల్లమయ్య, స్వామిదాస్, సుంకర్‌మోహన్, జైపాల్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.