calender_icon.png 25 October, 2024 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం నిర్ణయం భేష్

12-09-2024 12:07:30 AM

మాజీ ఎంపీ వీహెచ్

మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంలో సీఎం రేవం త్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎంపీ వీ హను మంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి చాకలి ఐలమ్మ గుర్తుకు రాలేదని విమర్శించారు. 1948 నల్లగొండ జిల్లా శాలిగౌ రారం  మండలం వల్లాల  గ్రామంలో పాఠ శాల విద్యార్థులు జాతీయ పతా కం ఎగురవేసినందుకు 8 మందిని అప్ప టి పాలకులు కాల్చి చంపారని, ఆ గ్రామంలో చరిత్రకు సాక్ష్యంగా సమా ధి నిర్మిస్తామని చెప్పారు. సాయుధ పోరాటంలో బీజేపీ లేనే లేదని అన్నా రు.

ఎంఐఎంకి భయపడి సెప్టెంబర్ 17ను అధికారికంగా కాంగ్రెస్ జరప డం లేదని కొంతమంది ఆరోపి స్తున్నారని, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. తమది సెక్యులర్ సిద్ధాంత మని, దేవుడి పేరుతో రాజకీ యాలు చెయ్యబోమని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు చీరెలు గాజులు పంపిస్తామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, గతంలో టీడీపీ, కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను మీరు తీసు కున్నప్పుడు ఏంచేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద అప్పటి గవర్నర్ నరసింహన్‌ను కలిసేందుకు వెళ్తే.. అరెస్టు చేసి తన సెక్యూరిటీని కూడా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.