‘ఎక్స్’ వేదికగా బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఫైర్
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రూ.కోట్లు సంపాదించేందుకే, కిరాయి మనుషులతో పరీక్షల వాయిదాకు ధర్నా చేయిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సముచి తం కాదని బుధవారం బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ ‘ఎక్స్’ వేదికగా హితవు పలికారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు రూ.కోట్లు సంపాదించేందుకు, వారు చేసేది సీఎంలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని మండిపడ్డారు.
90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని సీఎం హామీ ఇచ్చారని, ఆ సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఏపీలో గ్రూప్ మెయిన్స్‌కు 1:100 ఎంపిక చేయగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కావ డం లేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న అశోక్‌కుమార్ కేవలం ఒక్క రూపాయికే గ్రూప్ 2, 3 కోచింగ్ అందిస్తున్నారని గుర్తుచేశారు. అశోక్‌కుమార్ వెను క వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారన్నా రు. నిరుద్యోగులకు సంఘీభావంగా మాట్లాడిన ప్రతి వ్యక్తిపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, రేవంత్‌రెడ్డి కూడా ఎన్నికల ముందు అదే పనిచేశారని గుర్తుచేశారు. నాడు నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చిక్కడపల్లికి వచ్చి చిలక కబుర్లు చెప్పారని మండిపడ్డారు.