calender_icon.png 27 December, 2024 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాలో సీఎం జన్మదిన వేడుకలు

08-11-2024 03:04:23 PM

కాంగ్రెస్ భవన్ లో ఘనంగా వేడుకలు

కేక్ కట్ చేసిన నాయకులు, రోగులకు పండ్లు పంపిణీ, రక్తదానం చేసిన కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెడ్పిటిసి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేత రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతీ రెడ్డి రాజిరెడ్డి ఐసిడిఎంఎస్ చైర్మన్ తారా చందు జిల్లా అధ్యక్షుడు వేణు రాజ్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, నరేందర్ గౌడ్ మహిళా కాంగ్రెస్ నాయకు రాళ్లు ఉష, చంద్రకళ, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, విజయ, రాణి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.