calender_icon.png 28 December, 2024 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో సీఎం జన్మదిన వేడుకలు

08-11-2024 02:58:21 PM

కామారెడ్డిలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం

కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ లో కేక్ కట్ చేసి ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహణ

కామారెడ్డి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధిగ్రస్తుల చిన్నారులకు రక్తం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 200 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేకు ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా మున్సిపల్ కౌన్సిలర్ లు అధికారులు పాల్గొన్నారు.

బాన్సువాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మున్సిపల్ చైర్మన్ గంగాధర్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పంచి పెట్టారు మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ మండల నాయకులు నాగేశ్వరరావు సంపత్ రెడ్డి విట్టల్ రావు రమేష్ గణేష్ రావు దేశాయ్ నాగనాథరావు తదితరులు పాల్గొన్నారు.