calender_icon.png 22 April, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డికి ఘన సన్మానం

22-04-2025 01:41:14 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): కేసముద్రం పట్టణ అభివృద్ధి, వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా మంజూరు చేయిస్తూ, అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు మీరు చేస్తున్న మేలు మరువలేనిదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని వివిధ వర్గాలకు చెందిన వారు సోమవారం ఘనంగా సన్మానించారు.

సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణ పల్లికి రాగా, కేసముద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరు చేసినందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు. అలాగే షాదీ ఖానా నిర్మాణం కోసం 80 లక్షలు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ముస్లిం పెద్దలు నరేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం సలహాదారుగా కీలకమైన పదవి నిర్వర్తిస్తూనే సొంత మండలం అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం మా అదృష్టమని ఆయా సంఘాల నాయకులు పేర్కొన్నారు. విద్యా, వైద్య, రవాణా, విద్యుత్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు మంజూరు చేయించి ఊహించని విధంగా కేసముద్రం మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.